- అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆటవిడుపు
-
బీచ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి రిలాక్స్

ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరి కొద్ది రోజుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాజీ కాబోతున్నారు. తొలుత అధ్యక్ష బరిలోకి వచ్చినా.. అనంతరం వయోభారం కారణంగా అనూహ్యంగా పోటీ నుంచి బైడెన్ వైదొలిగారు. ఆయన స్థానంలో కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడిగా అధికారిక కార్యక్రమాలతో బిజిబిజీగా ఉండే బైడెన్.. వాటికి స్వస్తి చెప్పి హాయిగా రిలాక్స్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: IPL 2025: రోహిత్ శర్మ కోసం రూ. 50 కోట్లు.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే..!
అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్ నుంచి డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌కి వెళ్లి ఉల్లాసంగా గడిపారు. కుటుంబ సభ్యులతో కలిసి తీరంలో ఇసుక మేటలపై కుర్చీ వేసుకుని హాయిగా గడిపారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ (81), బైడెన్ ఇద్దరు సోదరీమణులతో కలిసి బీచ్‌లో రెండు గంటల పాటు గడిపారు. మధ్య మధ్యలో సంచిలో నుంచి పేపర్లు తీస్తూ జిల్ బైడెన్‌కు ఇస్తూ కనిపించారు. నెమ్మది.. నెమ్మదిగా పనులు చేసుకుంటూ కనిపించారు. అప్పుడప్పుడు టూరిస్టులు కూడా వచ్చి హాయ్ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. బీచ్‌లో ఎంజాయ్ చేస్తే.. దేశాన్ని ఎవరు పాలిస్తారంటూ కామెంట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి: Kadambari Jethwani Issue: ముంబై నటి వ్యవహారంపై విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి నియామకం