- ఆర్థికంగా ఆదుకోండి
-
వరల్డ్ బ్యాంక్‌కు యూనస్ ప్రభుత్వం విజ్ఞప్తి

ఆర్థిక సంక్షోభంతో బంగ్లాదేశ్ కొట్టుమిట్టాడుతోంది. కోటా ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్లతో బంగ్లాదేశ్ రణరంగం మారింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలు పాలయ్యారు. తాజాగా వరదలు కూడా తోడవ్వడంతో దేశం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడిండి. దీంతో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంకు వైపు చెయ్యి చాచింది. తమకు ఆర్థిక మద్దతు అందించాలని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఏడీబీలను సాయం కోరింది. 8 బిలియన్ డాలర్లను సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ దేశానికి 100 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు ఉంది. ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఎఎఫ్ నుంచి 300 బిలియన్ డాలర్లు, పునరావాస కార్యక్రమాలకు మరో 300 డాలర్లు కావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐఎంఎఫ్ బృందం వచ్చేనెల ఢాకాకు వెళ్లనున్నట్లు సమాచారం. గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం రుణ కార్యక్రమం కింద ఐఎంఎఫ్ నుంచి 4.7 బిలియన్ డాలర్లకు గాను ఇప్పటివరకు 2.3 బిలియన్ డాలర్లను పొందింది. ప్రస్తుతం బంగ్లాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆహార ఉత్పత్తుల ధరలు 14 శాతానికి పైగా పెరిగింది. 13 ఏళ్లలో ఇదే అత్యధికం. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిని అధిగమించేందుకు యూనస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ను సాయం కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పుడిప్పుడు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. కొద్ది రోజులుగా అశాంతితో అల్లాడిపోయింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తోంది. పరిస్థితులన్నీ అదుపులోకి వస్తున్నాయి.