- గతేడాది తనను తాను పెళ్లి చేసుకున్న ఓ మహిళ
-
ఇప్పుడు విడాకులు తీసుకున్న మహిళ -
ఆమె.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. మోడల్ -
ఆమె పేరు సులనే కారీ -
ఈమె ‘సోలోగామి’ తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్.

ఇప్పుడున్న ప్రపంచంలో ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం.. మగవాళ్లను మగవాళ్లు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరు ఇష్టపడితే చాలు.. బంధాలు కలుపుకుంటున్నారు. నేటి సమాజంలో ఇది కామన్ అయిపోయింది. అయితే.. గతేడాది ఓ మహిళ తనను తాను పెళ్లి చేసుకున్న ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా.. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మోడల్. ఆమె పేరు సులనే కారీ. ఈ 36 ఏళ్ల మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. ఈమె ‘సోలోగామి’ తనను తాను పెళ్లి చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రెజిల్‌కు చెందిన సులనే కారీ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుంది.
నివేదికల ప్రకారం.. సుల్లెన్ కారీ ఆమె చేసుకున్న వివాహంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రయత్నించింది. ఇందుకోసం కపుల్స్ థెరపీ కూడా తీసుకుంది. కానీ.. ఇదంతా ఫలించకపోవడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను నన్ను వివాహం చేసుకున్నాను, కానీ ఇప్పటికీ ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు ఏకస్వామ్యాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. అయితే, నా ఒంటరితనానికి నేను పశ్చాత్తాపపడను అని చెప్పింది. ‘జీవితంలో ఆత్మపరిశీలన, పరావర్తన అవసరమని నేను గ్రహించాను’ అని చెప్పింది.