Leading News Portal in Telugu

America Elections : ట్రంప్ అధికారంలోకి వస్తే ఎలాన్ మస్క్ కు కీలక పదవి


America Elections : ట్రంప్ అధికారంలోకి వస్తే ఎలాన్ మస్క్ కు కీలక పదవి

America Elections : ఎలోన్ మస్క్‌ కు తన కేబినెట్లో కీలక పదవి ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడితేనే ఈ పదవి తనకు దక్కుతుంది. తాను గెలిస్తే ఎలాన్ మస్క్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. విజయం తర్వాత తాను ‘గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కమిషన్’ని ఏర్పాటు చేస్తానని, దాని చీఫ్ ఎలోన్ మస్క్ అని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఓ ర్యాలీలో ప్రసంగించారు. న్యూయార్క్ ఎకనామిక్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ అయిన తర్వాత దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌లో భారీ కోత పెడతానని చెప్పారు. దీంతో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి కొనుగోలుపై కూడా పన్ను తగ్గుతుంది.

కంపెనీల కోసం వెల్త్ ఫండ్‌ను ప్రారంభిస్తానని ట్రంప్ చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ చాలా వారాలుగా ఎఫిషియెన్సీ కమిషన్ గురించి తన సహాయకులతో మాట్లాడుతున్నారు. అయితే తొలిసారిగా తన ప్రణాళికను బహిరంగంగా ప్రకటించాడు. ఈ కమిషన్‌కు సారథ్యం వహించేందుకు ఎలోన్ మస్క్ అంగీకరించారని కూడా ఆయన చెప్పారు. అయితే, ఈ కమిషన్ ఎలా పని చేస్తుందో డొనాల్డ్ ట్రంప్ వివరించలేదు. ఆరు నెలల్లో మోసం, అక్రమ నగదు లావాదేవీలు అరికడతామని ఆయన పేర్కొన్నారు.

ఈ కమిషన్‌లో తన మాజీ ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ మునుచిన్, ఇతర సహచరులను కూడా చేర్చనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో పూర్తి ఫైనాన్షియల్‌, పెర్ఫార్మెన్స్‌ ఆడిట్‌ నిర్వహించే అధికారం సమర్థతా కమిషన్‌కు ఉంటుందని ఆయన చెప్పారు. ఆగస్టు 19 న డొనాల్డ్ ట్రంప్‌తో ఒక ఇంటర్వ్యూలో.. మస్క్ తనకు ప్రభుత్వంలో సేవ చేసే అవకాశం వస్తే, అతను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. నాకు అవకాశం దొరికితే అమెరికాకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. దీని తరువాత, టెస్లా చీఫ్ సోషల్ మీడియా ఎక్స్‌లో రాశారు.. ఎటువంటి జీతం, ఏదైనా పదవి లేదా ఏదైనా గుర్తింపు అవసరం లేదన్నారు. ఎఫిషియెన్సీ కమిషన్ గురించి గతంలో కూడా అమెరికాలో చర్చ జరిగింది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ 1981లో అటువంటి సంస్థను సృష్టించారు. దీనికి గ్రేస్ కమిషన్ అని పేరు పెట్టారు. ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.