Leading News Portal in Telugu

IlliaYefimchyk: ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ గుండెపోటుతో మృతి..


IlliaYefimchyk: ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్ గుండెపోటుతో మృతి..

ఈరోజుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసమని.. వివిధ రకాల ఆహారాలు, జిమ్ వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. శరీరం ఫిట్గా అవుతుంది. ఎక్కువ సేపు జిమ్ల్లో ఉండి బాడీ ఫిట్ చేసుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాగే.. అధికంగా జిమ్ చేసి గుండెపోటుతో మరణించిన వారు చాలా మంది ఉన్నారు. జిమ్ చేయడం వల్ల బాడీ ఫిట్గా అవుతుంది.. కానీ.. దాని వల్ల గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా.. ప్రపంచ ప్రసిద్ధ బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఇలియా యెఫిమ్‌చిక్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 36 సంవత్సరాలు.. అతను చాలా ఫిట్గా ఉన్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోవడం అందరూ షాక్‌కు గురయ్యారు.

ఇలియా యెఫిమ్‌చిక్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది జిమ్, ప్రోటీన్ మొదలైన వాటిపై ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌కి సంబంధించి ఉన్న క్రేజ్‌కి ఫిట్‌గా కనిపించడానికి.. అంతర్గతంగా ఫిట్‌గా ఉండటానికి తేడా ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఇలియా యెఫిమ్చిక్ 6వ తేదీన గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో.. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించినప్పటికీ, సెప్టెంబర్ 11న మరణించాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఇలియాకు గుండెపోటు రావడంతో, భార్య అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చే వరకు అతనికి సీపీఆర్ (CPR) చేస్తూనే ఉంది.

అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. దీంతో.. చివరకు హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. ఆయన భార్య మాట్లాడుతూ, అతని కోసం దేవున్ని ప్రార్థిస్తూనే ఉన్నాను.. కానీ అతన్ని రక్షించలేకపోయాడు. బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శ్రేయోభిలాషులకు వారి ప్రార్థనలు, సంతాపానికి ధన్యవాదాలు అని భార్య అన్నా పేర్కొన్నారు.