Leading News Portal in Telugu

Sri lanka: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం


  • శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం

  • సిరిమావో బండారునాయకే తర్వాత హరిణిదే రికార్డ్ సొంతం

  • మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం
Sri lanka: శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం

శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ)కి చెందిన ప్రముఖ నాయకురాలు అమరసూర్య ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. హరిణి అమరసూర్య ఎన్‌పీపీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. మంగళవారం శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా హరిణి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2000లో సిరిమావో బండారునాయకే తర్వాత ఆ పదవిని చేపట్టిన మహిళగా హిరిణి చరిత్ర సృష్టించింది.

ఇది కూడా చదవండి: Job Gurantee: డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జాబ్ గ్యారంటీ కోర్సులు.. వినూత్న ప్రయోగానికి రేపు శ్రీకారం

శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే.. హరిణి చేత ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు ఇద్దరు సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. హరిణి అమరసూర్యకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం మరియు పెట్టుబడి వంటి అనేక కీలకమైన పోర్ట్‌ఫోలియోలు లభించాయి.

హరిణి..
హక్కుల కార్యకర్తగా మరియు యూనివర్సిటీ లెక్చరర్‌గా పనిచేసిన అమరసూర్య.. శ్రీలంకలో సామాజిక న్యాయం మరియు విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతికి సూచనగా ఉంది. 1994లో బండారునాయకే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. శ్రీలంక చరిత్రలో ఈ హోదాలో పనిచేసిన మూడవ మహిళగా హరిణి చరిత్ర సృస్టించింది.

మరో రెండు రోజుల్లో ప్రస్తుత పార్లమెంటు రద్దు కానుంది. రద్దయిన రోజు నుంచి 52 – 62 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి సమన్‌ శ్రీ రత్నాయకే తెలిపారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు