Musk “Dating” Meloni: ఇటలీ పీఎం జార్జియా మెలోనితో ఎలాన్ మస్క్ డేటింగ్.? వైరల్ ఫోటోపై మస్క్ క్లారిటీ..
- ఇటలీ ప్రధాని.. ఎలాన్ మస్క్ డేటింగ్..?
-
జార్జియా మెలోని..మస్క్ ఫోటో వైరల్.. -
డేటింగ్ ఊహాగానాలపై మస్క్ క్లారిటీ..

Musk “Dating” Meloni: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరు ‘‘డేటింగ్’’లో ఉన్నారంటూ ఇప్పుడు వీరిద్దరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్, జార్జియా మెలోని సంభాషిస్తున్న ఫోటో వైరల్ అయింది. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. ‘‘మెలోని నిజాయతీపరురాలు’’గా ప్రశంసించాడు.
ఇదే కాకుండా మస్క్, మెలోనికి అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును అందజేస్తూ, ‘‘ఆమె బయట కన్నా ఆమె మనసు మరింత అందమైంది’’ అని ప్రశంసించారు. జార్జియా మోలోనిని నేను అభిమానించే వ్యక్తి, ఇటలీ ప్రధాని అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కొనియాడారు. ఈ పొగడ్తలు, వైరల్ అవుతున్న ఫోటోల గురించి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
అట్లాంటిక్ కౌన్సిల్ పంపిణీ చేసిన మీడియా ప్యాకేజీ ప్రకారం, మెలోని “EUకి బలమైన మద్దతు ఇవ్వడంతో పాటు ఇటలీకి మొదటి మహిళా ప్రధాని అయినందుకు ఈ అవార్డు అందుకుంది. ఇదిలా ఉంటే, టెస్లా ఫ్యాన్ క్లబ్ మస్క్, మెలోని ఫోటోని పోస్ట్ చేసి.. ‘‘మీరు డేటింగ్ చేస్తున్నారా..? అని ప్రశ్నించింది. అందుకు ఎలాన్ మస్క్ తన సమాధానంగా ‘‘ డేటింగ్ చేయడం లేదు’’ అని బదులిచ్చాడు.
Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb
— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024
Grazie Elon pic.twitter.com/NgHchWLUtB
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 24, 2024