Leading News Portal in Telugu

Hindu Temple Attack: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి..


  • అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి..

  • ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక సందేశాలు రాసిన దుండగులు..

  • హిందువులు గో బ్యాక్ అంటూ కామెంట్స్ రాసిన గుర్తు తెలియని వ్యక్తులు..
Hindu Temple Attack: అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి..

Hindu Temple Attack: అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో గల బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై దాడి జరిగింది. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక సందేశాలు రాశారు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ దాడిని ఆలయ అధికారులు, భక్తులు తీవ్రంగా ఖండిస్తూ మత సామరస్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇంతకు ముందు, న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలోని BAPS మందిర్‌లో ఇలాంటి సంఘటన పది రోజుల కిందటే జరిగింది. బాప్స్ మందిరం యొక్క గోడలపై “హిందువులు గో బ్యాక్” అనే వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి. ఇవి స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. ఈ ఘటనకు నిరసనగా సంఘ నాయకులు ద్వేషానికి వ్యతిరేకంగా కలిసి వస్తామని ప్రతిజ్ఞ చేశారు. శాంతి, ఐక్యతను పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఇక, ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘ సభ్యులు ప్రార్థన వేడుక కోసం సమావేశమయ్యారు. పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ నుంచి శాంతి, ఐక్యత యొక్క బోధనలలో ఓదార్పు పొందారు. కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు స్టెఫానీ న్గుయెన్, ఎల్క్ గ్రోవ్ మేయర్ బాబీ సింగ్-అలెన్, రాంచో కార్డోవా వైస్ మేయర్ సిరి పులిపాటి, పోలీస్ చీఫ్ మాథ్యూ తమయో లాంటి స్థానిక నాయకులు హిందూ సంఘాల యొక్క విశ్వాసాలకు మద్దతుగా ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాక్రమెంటో ప్రాంతంలోని మా మందిరంపై గత రాత్రి హిందూ వ్యతిరేక ద్వేషంతో చేసిన వ్యాఖ్యలతో అపవిత్రం చేయబడింది అని బాప్స్ మందిరం తన సోషల్ మీడియాఅ కౌంట్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. ఆలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.