-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం - ధర ఎన్ని కోట్లో తెలుసా?
ప్రపంచంలో వందల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్న వాటిలో మద్యం ఒకటి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం ఏది అని మిమ్మల్ని అడిగితే, మీరు దాన్ని గూగుల్ చేయాల్సి రావచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్ విలువ కోట్లాది రూపాయలు. ఈ మద్యాన్ని కొనుగోలు చేసే వ్యక్తి తాగడం కంటే దాన్ని చూసి ఆనందిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ పేరు ఇసాబెల్లా ఇస్లే. ఒక బాటిల్ ఖరీదు దాదాపు 6.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 52 కోట్లు). ఈ ధరతో మీరు మెట్రోపాలిక్ ప్రాంతాల్లో కొన్ని ఫ్లాట్లు కొనుగోలు చేయొచ్చు.
ఈ వైన్ ఎందుకు చాలా ఖరీదైనది?
ఈ మద్యానికి ఇంత ఖరీదు ఎందుకు అన్నది అతిపెద్ద ప్రశ్న. వాస్తవానికి, ఈ మద్యం ఉంచిన సీసా తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఇది ఒక కంటైనర్ లాంటిది. అంతేకాకుండా.. ఇది 8500 వజ్రాలు, 300 కెంపులతో నిండి ఉంది. ఇది ఒక సింగిల్ స్కాచ్ మాల్ట్ విస్కీ. ఇది మే 2011లో ప్రారంభించబడింది.
ఇది ఎక్కడ లభిస్తుంది?
దాని వెబ్సైట్ isabellasislay.com ప్రకారం.. ఇది ఒక ప్రత్యేక ఎడిషన్ విస్కీ. కొనుగోలు చేసే వెబ్సైట్లో అలాంటి ఎంపిక లేదు. అయితే.. మీరు వెబ్సైట్లోని కాంటాక్ట్ అస్ ఆప్షన్లోకి వెళ్లినప్పుడు.. ఇమెయిల్ ఐడి కనిపిస్తుంది. బహుశా కంపెనీని సంప్రదించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రపంచంలోని ఈ విస్కీలు కూడా ఖరీదైనవే..
ఇసాబెల్లా ఇస్లే కాకుండా ఇంకా చాలా వైన్ల బాటిళ్లకు లక్షలు, కోట్ల రూపాయల ధర పలుకున్నాయి. అందులో మకాల్లన్ ఎం కూడా ఒకటి. ఈ మద్యం బాటిల్ ధర రూ.5 కోట్లకు పైగానే ఉంది. కాగా మకాలన్ విస్కీ బాటిల్ ధర దాదాపు రూ.4 కోట్లు. మనం భారతదేశం గురించి మాట్లాడినట్లయితే.. రాంపూర్ సిగ్నేచర్ రిజర్వ్ దేశంలోని అత్యంత ఖరీదైన మద్యంగా పరిగణించబడుతుంది. దీని బాటిల్ ధర దాదాపు రూ.5 లక్షలు. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ యొక్క పరిమిత ఎడిషన్ మాత్రమే ప్రారంభించబడింది.