Leading News Portal in Telugu

Medical Emergency: ఢిల్లీ-లండన్ విమానం డెన్మార్క్‌లో అత్యవసర ల్యాండింగ్


  • మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా.
  • ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని.
  • డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌కు మళ్లింపు.
Medical Emergency: ఢిల్లీ-లండన్ విమానం డెన్మార్క్‌లో అత్యవసర ల్యాండింగ్

Medical Emergency: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆదివారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌కు మళ్లించారు. విమానయాన సంస్థ నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రయాణ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణీకులలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని కోపెన్‌హాగన్ విమానాశ్రయంలో డిబోర్డ్ చేసినట్లు చెప్పారు. డెన్మార్క్‌ లోని కోపెన్‌హాగన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ఎయిరిండియా వివరణ ఇచ్చింది. అక్టోబర్ 6, 2024 న ఢిల్లీ నుండి లండన్ వెళ్లే AI111 విమానం డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విమానాశ్రయంకు మళ్లించిందని పేర్కొంది.

Jani Master : జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు

విమానంలో ఉన్న ఒక ప్రయాణీకుడు అనారోగ్యంతో ఉన్నారని ఫిర్యాదు చేయడంతో డీబోర్డ్‌కు వెళ్లారని, వెంటనే అతన్ని వైద్య చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారని ఎయిర్ ఇండియా తెలిపింది. కోపెన్‌హాగన్ ఎయిర్‌పోర్ట్‌లోని మా గ్రౌండ్ సహోద్యోగులు ఈ మళ్లింపు కారణంగా ప్రయాణికులందరికీ అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ వంతు కృషి చేశారు. విమానం కోపెన్‌హాగన్ నుండి బయలుదేరిందని, త్వరలో లండన్‌లో ల్యాండ్ అవుతారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియాకు మా ప్రయాణీకులు, సిబ్బంది భద్రత అలాగే శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని మేము పునరుద్ఘాటించాలనుకుంటున్నామని తెలిపింది.

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

ఐకమరోవైపు, ఆదివారం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం, విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటికే విమానాశ్రయంలో మళ్లీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.