Leading News Portal in Telugu

Israel-Hezbollah: బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్‌బొల్లా మరో కీలక నేత మృతి


  • మరోసారి హెజ్‌బొల్లాపై దాడి చేసిన ఇజ్రాయెల్ దాడులు..

  • హెజ్‌బొల్లా ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్ ను హతమార్చిన ఐడీఎఫ్..

  • ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని హెజ్‌బొల్లా
Israel-Hezbollah: బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్‌బొల్లా మరో కీలక నేత మృతి

Israel-Hezbollah: హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్‌ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో హొసైనీ మరణించాడని ఇజ్రాయెల్‌ సైనిక దళాలు పేర్కొన్నాయి. కాగా, ఈవిషయంపై ఇప్పటి వరకు హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇక, హమాస్‌లో కీలక నేతలే లక్ష్యంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. సోమవారంతో గాజా యుద్ధానికి ఏడాది పూర్తవడంతో హమాస్, బీరుట్‌పై ఏకకాలంలో బాంబులతో దాడి చేసింది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా నిర్విరామంగా వైమానిక దాడులు చేస్తుంది. అలాగే, ఆదివారం గాజాలో హమాస్‌పైనా ఐడీఎఫ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేర్‌ అల్‌-బలాహ్‌లోని ఓ మసీదు, ఓ స్కూల్ పై బాంబులతో దాడి చేసింది. ఈ రెండు ఘటనల్లో 26 మంది పాలస్తీనియన్లు మరణించారు. తాము హమాస్‌ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ కు చెందిన ఐడీఎఫ్‌ సిబ్బంది పేర్కొంది.