- మరో రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..
-
డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం.. -
రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి పురుషులను ప్రేరేపిస్తున్న అడల్ట్ స్టార్స్..

Hands Off My Porn: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మరో రెండు వారాలే సమయం ఉండటంతో ప్రచారంలో డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలోని నిలిచిన కమలా హరీస్, మాజీ ప్రెసిడెంట్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, తాజాగా ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక పోర్న్ స్టార్‌తో అతడికి సంబంధం ఉన్నప్పటికి.. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే.. మొత్తం పరిశ్రమను మూసివేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ వచ్చే నెలలో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి యువకులను ప్రేరేపించాలని తీర్మానం చేసుకున్నారు.
ఇక, #HandsOffMyporn అనే హ్యాస్ ట్యాగ్ తో చేస్తున్న ప్రచారంలో ప్రధానంగా పురుషులను ఈ పోర్స్ స్టార్స్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఇప్పటి వరకు పలు వెబ్‌సైట్‌లలో ప్రకటనల కోసం ఈ అడల్డ్ ఫిల్మ్ స్టార్స్ $200,000 వెచ్చించారు. ప్రధానంగా అశ్లీలతను నిషేధించాలని.. అడల్ట్ స్టార్స్ ను జైలులో పెట్టాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నట్లు గ్రాఫిక్ డిజైన్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, ప్రాజెక్ట్ 2025 అనేది పోర్న్‌ను పూర్తిగా నిషేధించాలనేది. దీనికి ప్రతిస్పందనగా అమెరికాలోని అడల్ట్ స్టార్స్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆందోళనలు పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా లాంటి రాష్ట్రాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.