- ‘ఎక్స్’ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం ప్రణాళికలు.
- కమలా హారిస్ బృందంలో ఇంగ్లాండ్ కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెక్ స్వీనీ ప్రముఖ పాత్ర.
- ‘కిల్ మస్క్స్ ట్విటర్’ పేరిట..

Elon Musk Claims Kamala Harris Team Is Planning to Suppress X platform: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలా హారిస్ బృందంలో ఇంగ్లాండ్ కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెక్ స్వీనీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే, మోర్గాన్ మెక్ స్వీనీ ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీకు ఇంగ్లాండ్ ప్రధాని స్ట్రీమర్ లేబర్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా సీసీడీహెచ్ సంస్థకు సంబంధించిన కొన్ని పత్రాలను ది డిస్ఇన్ఫర్మేషన్ క్రానికల్ సంస్థ బట్టబయలు చేసింది.
మార్చి 2024లో రూపొందించిన పత్రాల్లో మస్క్‌కు చెందిన ట్విటర్‌ను ఎలా అణచివేయాలనే దానిపై ప్రణాళికలు పలు దశల్లో స్పష్టంగా వివరించి ఉన్నాయి. ఈ ప్రణాళికలలో ‘కిల్ మస్క్స్ ట్విటర్’ పేరిట ఉండి, ఇంకా ఆర్థికంగా అస్థిరపర్చడం, వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారిని భయపెట్టడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే, ఈ అంశాన్ని ‘ఎక్స్’ కు చెందిన డెయిలీ న్యూస్ వేదికపై కూడా షేర్ చేసుకున్నారు. ఈ పరిణామాలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. “ఇది అమెరికాలో క్రిమినల్ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల్లో జోక్యం చేసుకొనేలా ఉందని, సీసీడీహెచ్ దాని దాతలపై పోరాడుతామని ఆయన అన్నారు. ఇక మరోవైపు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల తర్వాత ఆయనకు అండగా నిలబడ్డారు. ఓ కార్యక్రమంలో ఎలాన్ మాస్క్ ట్రంప్ ను ఉద్దేశించి కూడా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే.
This violates US criminal statutes against foreign interference in elections.
We are going after CCDH and their donors.
AND their donors. https://t.co/UyTtaE3Fzr
— Elon Musk (@elonmusk) October 22, 2024