Leading News Portal in Telugu

Elon Musk X Post On US Elections Results Day


  • ముందంజలో కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్..

  • అమెరికా ఫలితాలపై స్పందించిన ఎలాన్ మస్క్..

  • ఎక్స్ వేదికగా ‘గేమ్ సెట్‌ అండ్‌ మ్యాచ్‌ అని రాసుకొచ్చిన మస్క్
Elon Musk: అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్‌ ముందంజ.. ఎలాన్ మస్క్‌ పోస్ట్‌

Elon Musk: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాజాగా ఓటింగ్ ముగిసి, ఫలితాలు వెలువడుతోన్న సందర్భంగా ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘గేమ్ సెట్‌ అండ్‌ మ్యాచ్‌’ అని రాసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని మస్క్ వెల్లడించారు.

అయితే, మరోవైపు స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఎలాన్‌ మస్క్‌ ఎలక్షన్ గివ్ అవే కింద ప్రైజ్ మనీ స్కామ్ ను ప్రవేశ పెట్టారు. ఆ ప్రైజ్‌మనీ విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాన్నీ లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు కాకుండా ముందుగానే నిర్ణయించిన వ్యక్తులకే ప్రైజ్‌మనీ ఇస్తున్నారని టెక్సాస్ ఫెడరల్‌ కోర్టులో ఆరిజోనా నివాసి జాక్వెలిన్‌ మెక్‌అఫెర్జీ ఎలాన్ మస్క్ పై దావా వేసింది.