- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైనట్లే.
- నిరాశలో ప్రసంగం రద్దు చేసుకున్న కమలా హారిస్..

US Elections 2024: నేడు వెలబడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైనట్లే అర్థమవుతుంది. ఇప్పటికే ఆయన మరోసారి అమెరికా అధ్యక్ష పీఠన్నీ ఎక్కేందుకు ఆయన రంగం సిద్ధం చేసారు. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల ప్రకారం.. ట్రంప్ మెజార్టీ మార్క్‌కు దాటేశాడు. దింతో దేశవ్యాప్తంగా ట్రంప్ మద్దతుదారులు పెద్దెత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా తన మద్దతుదారుల కోసం వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే, అమెరికా ఎన్నికల ఓటమి నేపథ్యంలో డెమొక్రాట్ కమలా హారిస్ తన ప్రసంగాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆమె హోవర్డ్ యూనివర్సిటీ వాచ్ పార్టీలో ప్రసంగించాల్సి ఉండగా.. ఆమె రేపు మాట్లాడతారని కమల ప్రచార బృంద సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ తెలిపారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు కావడానికి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 270 ఓట్లు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ట్రంప్ 277, హారిస్ 226 ఆధిక్యంలో ఉన్నారు. అందులో 7 స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ దాదాపు ఆరింటిలో ముందంజలో ఉన్నారు.