Leading News Portal in Telugu

Pm modi tweet on donald trump wins. he says Heartiest congratulations my friend Donald Trump


  • హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ..
  • డొనాల్డ్ ట్రంప్‭కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ .
  • ఇద్దరమూ కలిసి పనిచేద్దామంటూ..
PM Modi: నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‭కు శుభాకాంక్షలు

PM Modi Tweet On Donald Trump Win: ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికలు 2024 ఫలితాలు రానే వచ్చేసాయి. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్ని వర్గ రంగాలకు సంబంధించి ప్రముఖులు, వివిధ దేశాది నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారతదేశ ప్రధాని మోడీ కూడా మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికనైనా ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మోడీ ట్రంప్ కు అభినందనలు తెలిపారు.

హృదయపూర్వక అభినందనలు మిత్రమా.. అంటూ మోడీ ట్రంప్ ను ఉదేశిస్తూ పోస్ట్ చేసారు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, మీ చారిత్రాత్మక ఎన్నికల విజయం సందర్బంగా.. భారతదేశం, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నట్లు ఆయన అన్నారు. మన ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, ఇంకా శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని చేద్దామని ఆయన రాసుకొచ్చారు.

ఇకపోతే, ట్రంప్ గత పాలనలో భారత్, అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నా.. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు జారుతున్నాయి. అమెరికా దేశానికీ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం లాంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారబోతున్నాయి.