Leading News Portal in Telugu

Israeli PM Benjamin Netanyahu Congratulated Donald Trump


  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం..

  • ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • మీరు వైట్హౌస్లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది: ఇజ్రాయెల్
Benjamin Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని

Benjamin Netanyahu: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో రెండోసారి యూఎస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల అధినేతలు పలువురు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు ట్రంప్ కు విషెస్ చెప్పారు. తన ట్విటర్ ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ తో తను, తన భార్య సారా నెతన్యాహు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చారు. చరిత్రలో గొప్ప పునరాగమనానికి అభినందనలు తెలిపారు. మీరు వైట్ హౌస్ లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మీ విజయంతో అమెరికా, ఇజ్రాయెల్ బంధం మరింత బలోపేతం కాబోతుంది అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.

ఇక, అంతకు ముందు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నా ప్రియ మిత్రుడు ట్రంప్ కు హృదయపూర్వక అభినందనలు అని రాసుకొచ్చారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా.. అంటూ మోడీ ట్రంప్ ను ఉదేశిస్తూ.. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా.. మీ చారిత్రాత్మక ఎన్నికల విజయం సందర్బంగా.. భారతదేశం, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నట్లు నరేంద్ర మోడీ అన్నారు.