Leading News Portal in Telugu

Donald trump Win 2024 us eletions elected as a 47th us president


  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం.
  • 277 స్థానాలలో విజయం.
  • వారందరికీ కృతజ్ఞతలు అంటూ..
Donald Trump: మరోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం

Donald Trump Win US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే సంవత్సరం బంగారుమయం అవుతుందని, ఈ విజయం అపురూపం అని ఆయన అన్నారు. ముఖ్యంగా మాకు స్వింగ్ రాష్ట్రాల పూర్తి మద్దతు లభించిందని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ 277 స్థానాలలో విజయం సాధించగా, 226 స్థానాలలో కమలా హారిస్ విజయం సాధించారు. దీనితో విజయానికి 270 స్థానాలు అవసరం అవ్వగా.. దానిని దాటేసిన ట్రంప్ విజయాన్ని నమోదు చేసారు. ముందు నుంచే కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్‌ ధీమా వ్యక్తం చేసిన ఆయన, అనుకున్నట్లుగానే గెలిచారు. మొత్తానికి మరో మారు విజయం అందుకున్న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విజయం తో ట్రంప్‌ 2.o.. పాలనపై అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డోనాల్డ్ ట్రంప్‌ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ఇదివరకు 1988, 2004, 2012 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం చేసారు. కానీ అది జరగలేదు. అయితే, న్యూయార్క్‌ గవర్నర్‌ పదవిపై 2006, 2014లో దృష్టి సాధించారు. కాకపోతే, ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. ఆ తర్వాత పలు ప్రయత్నాల తర్వాత 2015 జూన్‌ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ సమయంలో ఆయన మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాననే నినాదంతో ట్రంప్ ప్రచారం ప్రారంభించారు.