Leading News Portal in Telugu

Donald Trump Victoy Speech – NTV Telugu


  • స్వింగ్‌ స్టేట్లలో విజయంపై ట్రంప్‌ ఆనందం..

  • అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..

  • అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తాను: డొనాల్డ్ ట్రంప్
Trump Victory Speech: అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..

Trump Victory Speech: అధ్యక్ష ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో డొనాల్డ్ ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రారంభోపన్యాసం సందర్భంగా సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్‌తో కలిసి ట్రంప్‌ వేదిక పైకి వచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్‌ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్‌ ఓట్లలోనూ రిపబ్లికన్‌ పార్టీదే హవా కొనసాగుతుందని తెలిపారు. ఈ రాజకీయ మార్పు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇక, అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుంది అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజల కోసం పని చేస్తాను.. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, సరిహద్దుల మూసివతేను పరిశీలించాలి.. ఎవరైనా సరే చట్టబద్దంగానే దేశంలోకి రావాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు.