Leading News Portal in Telugu

First transgender Sarah McBride won the Democratic nomination from Delaware’s At-Large House District


  • అమెరికా ఎన్నికల్లో.
  • విజయం సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌.
  • డెమోక్రటిక్ అభ్యర్థిగా సారా మెక్‌బ్రైడ్ విజయం.
US Election 2024: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌

US Election 2024: అమెరికా ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతానికి అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. వివరాలు తెలిసే సరికి ట్రంప్ 230 స్థానాలలో ముందజలో ఉండగా.. కమలా హారిస్ 210 స్థానాలతో స్వల్పంగా వెనుకపడి ఉంది. ఇకపోతే, డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుండి డెమోక్రటిక్ అభ్యర్థిగా సారా మెక్‌బ్రైడ్ (Sarah McBride) విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు. జాన్ వేలెన్ 3, సారా మెక్‌బ్రైడ్ రిపబ్లికన్ గెలుపు కోసం పోటీ పడ్డారు. తాను గెలిచింది కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడం కోసం కాదని, కేవలం డెలావేర్‌లో మార్పును సృష్టించేందుకేనని సారా వివరించారు.

సారా మెక్‌బ్రైడ్ జాతీయ ఎల్‌జీబీటీక్యూ కార్యకర్తగా చ్చేస్తున్నారు. దాంతో ఆవిడ ఎన్నికల సమయంలో ఏకంగా 30 లక్షల డాలర్స్ కు పైగా ప్రచార విరాళాలు సేకరించింది. 2016లో, డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి లింగమార్పిడి వ్యక్తిగా ఆమె పేరు గాంచింది. డెలావేర్ నుండి ఆవిడ 2020లో మొదటి ట్రాన్స్‌స్టేట్ సెనేటర్ అయ్యారు. 2010 నుండి, డెలావేర్ ఓటర్లు డెమొక్రాట్‌లకు మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సారా మెక్‌బ్రైడ్ ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించారు.