- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వైపు యువ ఓటర్లు..
-
ఈసారి పెద్ద ఎత్తున ట్రంప్ కు ఓటేసినట్లు వెల్లడించిన యంగ్ ఓటర్స్..
US Young Voters: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా మొగ్గినట్లు సమాచారం. అసోసియేటెడ్ ప్రెస్ ఓట్ కాస్ట్‌లో ఈ విషయం తేలింది. ఈసారి ట్రంప్- హారిస్ మధ్య నెక్ టూ నెక్ పోరు కొనసాగుతుంది. 2020 నాటితో పోలిస్తే చాలా డెమోగ్రటిక్ గ్రూపులు ఈసారి ట్రంప్ పక్షం వహించినట్లు ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది. వీరిలో ముఖ్యంగా యువ ఓటర్లే ఉన్నట్లు ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. 30ఏళ్ల లోపు వారిలో గతంలో పదింట ముగ్గురు మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌నకు సపోర్ట్ ఇవ్వగా.. ఈసారి ఆ సంఖ్య పదింట నలుగురికి చేరిపోయింది.
అయితే, 2020 ఎన్నికల్లో 18-21 మధ్య వయస్సు ఉన్న వారు అత్యధికంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ వయస్కుల్లో 50 శాతం మంది పోలింగ్ కేంద్రాల దగ్గర నాడు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ప్రస్తుతం అమెరికాలో జనరేషన్ జీ ఓటర్లు దాదాపు 4.1 కోట్ల మంది ఉన్నట్లు టఫ్ట్స్ విశ్వ విద్యాలయం అంచనా వేసింది. అయితే, పోలింగ్ పూర్తై కౌంటింగ్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఫలితాలు అంచనాలకు భిన్నంగా వస్తున్నాయి. స్వింగ్ రాష్ట్రాల్లో రిజల్ట్స్ మరింత ఆసక్తి కరంగా మారాయి.