- సౌదీ అరేబియాలో విచిత్ర వాతావరణం..
-
అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో భారీగా కురుస్తున్న మంచు.. -
ఎడారి రోడ్లపై మంచును చూసి ఎంజాయ్ చేస్తున్న స్థానికులు..

Saudi Arabia: గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఎడారి. అక్కడ విపరీతమై ఎండలు మండిపోతాయి. అయితే, ప్రస్తుతం అక్కడ క్రమంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఎడారి దేశంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలోనే తొలిసారి భారీగా మంచు వర్షం కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇక, సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో కనుచూపు మేర మంచు దుప్పటి కప్పేసింది. అయితే, ఈ ప్రాంతం ఏడాదంతా పొడి వాతావరణంలో కనిపిస్తుంది. శుష్క వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వర్షాలు పడటం, మంచు కురవడం ఇక్కడ సాధ్యం కాదు. అలాంటిది చరిత్రలో మొట్టమొదటిసారి ఇక్కడ తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మంచు కురుస్తుంది. ఎడారి రోడ్లపై మంచును చూసి స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అయితే, వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పుపై యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం రియాక్ట్ అయింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా రాబోయే రోజుల్లో వడగళ్ల వానలు, బలమైన గాలుల, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, రాబోయే రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది. సుదీర్ఘ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని స్థానికులకు సూచనలు జారీ చేసింది.
🏝❄️ Saudi Arabian desert covered in snow
This is the first time in history that the desert has been covered in snow, as temperatures there rarely drop to such levels.
A severe hail storm also raged there recently. pic.twitter.com/4wjSaaRMfo
— Nurlan Mededov (@mededov_nurlan) November 3, 2024
Snow in Saudi Arabia pic.twitter.com/ZLWHayKztT
— Yisrael official 🇮🇱 🎗 (@YisraelOfficial) November 5, 2024