Leading News Portal in Telugu

Massive fire broke out in the US state of California fire is spreading fast due to heavy wind


  • అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో..
  • పెద్దెత్తున కార్చిచ్చు.
  • గాలులు బలంగా వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాప్తి.
California wildfire: భారీగా కార్చిచ్చు.. భారీగా ఇళ్లను వదిలివెళ్తున్న ప్రజలు

California wildfire: బుధవారం అమెరికా ఎన్నికల సంబరాలు ముగిసాయి. ఎన్నికల ఫలితాలలో భాగంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్ర రాజ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పెద్దెత్తున కార్చిచ్చు మొదలింది. గాలులు బలంగా వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ కారణంగా అధికారులు లాస్‌ఏంజెలెస్‌ సమీపంలోని సుమారు 10 వేల మందికి పైగా ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని వేల సంఖ్యలో నివాస ప్రాంతాలు, నిర్మాణాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో.. అక్కడి ప్రజలను తరలించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. కార్చిచ్చు కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కావడంతో స్థానికులు అంధకారంలో ఉండి పోవాల్సి వస్తోంది. ఇక కార్చిచ్చు సంబంధించిన మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా పెద్దెతున్న పొగ వ్యాపించింది. దాంతో చుట్టూ ఉన్న ప్రాంతం సరిగా కనిపించడం లేకపోవడంతో ప్రజల తరలింపు, మంటలను ఆర్పే ప్రయత్నాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కేవలం అయిదు గంటల వ్యవధిలోనే.. మొదటగా కిలోమీటరు విస్తీర్ణంలో మొదలైన మంటలు ఏకంగా 60 కి.మీ. పైగా వ్యాపించాయి. ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని, అక్కడి సమీప ప్రాంత ప్రజలు వెంటనే వారి ప్రదేశాలను ఖాళీ చేయాలని వెంచురా కౌంటీ అధికారులు ప్రజలను కోరారు. కార్చిచ్చు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.