- పెన్సిల్వేనియాలో కమలా హరీస్ భారీ లీడింగ్..
-
పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు.. -
పెన్సిల్వేనియాలో మోసం జరుగుతున్నాయని ఆరోపించిన ట్రంప్..

Donald Trump: పెన్సిల్వేనియాలో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హరీస్ భారీ లీడింగ్ సాధించింది. పెన్సిల్వేనియాపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనకు తగిన లీడ్ రాకపోవడంతో తీవ్ర ఆరోపణలు చేశారు. అతిపెద్ద నగరమైన పెన్సిల్వేనియాలోని ఓటింగ్ విశ్వసనీయతపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియాలో అధిక ఓటర్లు ఉన్నట్లు అక్కడి వార్తా సంస్థల్లో కథనాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలో దీనిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర మండిపడ్డారు.
పెన్సిల్వేనియాలో జరుగుతున్న భారీ మోసం గురించి చర్చలు జరుపుతున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. చట్టం అమలులోకి వస్తోందని తన ట్రూత్ సామాజిక మాధ్యమంలో ఆయన రాసుకొచ్చారు. మరోవైపు ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని రిపబ్లికన్‌కు చెందిన సిటీ కమిషనర్ సేథ్ బ్లూస్టెయిన్ తెలిపారు. తప్పుడు సమాచార వ్యాప్తికి ఈ ఆరోపణలు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అదే విధంగా పెన్సిల్వేనియాలో ఓటింగ్ సక్రమంగా కొనసాగుతుందని వెల్లడించారు. అమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి అయింది. 2016 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్లతో డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ గెలిచారు. అదే 1 శాతం ఓట్లతో 2020 ఎన్నికల్లో ఓడిపోయారు.