Leading News Portal in Telugu

Russia President Vladimir Putin Praises India Once Again


  • భారత్‭పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు..

  • భారత్‌- రష్యాల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయి..

  • భారతదేశం ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోంది: పుతిన్
India–Russia Relations: భారత్‭పై మరోసారి ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు

India–Russia Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌ను మరోసారి ప్రశంసించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని చెప్పుకొచ్చారు. భారత్‌ ఓ గొప్ప దేశం.. వారితో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా ఉందన్నారు. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుండగా.. మా సంబంధాలు ఎక్కడ, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది నేటి వాస్తవాలపై ఆధారపడి ఉందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్‌కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి పూర్తి అర్హత ఉందని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. భద్రత, రక్షణరంగాలలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరిత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కాగా, భారత్- రష్యా మధ్య వాణిజ్యం ఏడాదికి 60 బిలియన్‌ డాలర్లుగా ఉందని వ్లాదిమిర్ పుతిన్‌ వెల్లడించారు. ఇక, భారత్- రష్యా మధ్య ఉమ్మడి సహకారానికి బ్రహ్మోస్‌ను ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసానికి, భవిష్యత్తులో భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో సోవియెట్‌ యూనియన్‌ పాత్రను రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తు చేశారు.