Leading News Portal in Telugu

New York City ending voucher program that allowed migrant families to buy their own food


  • వలసదారులకు షాక్ ఇచ్చిన యూఎస్ఏ

  • వోచర్ ప్రోగ్రామ్‌ని నిలిపేసిన న్యూయార్క్..
USA: వలసదారుల షాక్.. వోచర్ ప్రోగ్రాంని నిలిపేసిన న్యూయార్క్ సిటీ..

USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆ దేశంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్రంప్ ప్రధాన హమీల్లో ఒకటైన వలసదారుల్ని, శరణార్ధుల్ని దేశంలో నుంచి తొలగించడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వలసదారుల కోసం ప్రారంభించిన ‘‘డెబిట్ కార్డ్ ప్రోగ్రామ్’’ లేదా ‘‘వోచర్ ప్రోగ్రాం’’ని న్యూయార్క్ సిటీ ముగింపు పలికింది.

‘‘మేము శరణార్ధుల ప్రోగ్రామ్ ఒక సంవత్సరం పదవీ కాలం ముగిసిన తర్వాత, ఈ పైలట్ ప్రోగ్రాం కోసం అత్యవసర ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని మేము నిర్ణయించుకున్నాం’’ అని మేయర్ ఎరిక్ ఆడమ్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా నగరం అందించే నిధులతో నడిచే హోటళ్లలో బస చేసే వలస కుటుంబాలకు డెబిట్ కార్డులను పంపిణీ చేస్తారు. వారు తమ సొంత ఆహారాన్ని కొనుగోలు చేసుకోవడానికి అనుమతించబడుతారు. ఈ చర్య ద్వారా 2 బిలియన్ డాలర్లు ఆదా కాబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న వలస కుటుంబాలు ఏడాది చివరకు డెబిట్ కార్డులు అందుకోవడం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కొందరు అదనపు ఖర్చుగా చెబుతున్నారు.