Leading News Portal in Telugu

Non veg and liquor served at pm starmer Diwali party british hindus objected



  • లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు
  • రిసెప్షన్ మెనూలో నాన్‌వెజ్..మద్యం
  • సోషల్ మీడియాలో హిందూ సంఘాల అభ్యంతరం
  • సమాధానమిచ్చిన డౌనింగ్ స్ట్రీట్
UK: ప్రధాని నేతృత్వంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మాంసం, మద్యం.. హిందూవుల్లో ఆగ్రహం

లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్ నిర్వహించిన దీపావళి రిసెప్షన్ మెనూలో అంశాలను చేర్చే ముందు సరైన సలహా తీసుకోకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నాన్ వెజ్ స్నాక్స్, మద్యాన్ని మెనూలో చేర్చడంపై బ్రిటిష్ హిందువులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల పండుగ ఆధ్యాత్మిక కోణంపై అవగాహన లేకపోవడాన్ని హిందూ సంస్థ ఇన్‌సైట్ యూకే ప్రశ్నించింది. మరికొందరు ఇలాంటి మతపరమైన సంఘటనలకు ముందు మరిన్ని సంభాషణలు అవసరమని అంటున్నారు. ఇన్‌సైట్ యూకే సోషల్ మీడియా ఎక్స్‌లో.. “దీపావళి అనేది వేడుకల సమయం మాత్రమే కాదు. దానికి మతపరమైన అర్థం కూడా ఉంది. పవిత్రమైన దీపావళి పండుగ స్వచ్ఛత, భక్తిని నొక్కి చెబుతుంది. అందువల్ల సాంప్రదాయకంగా శాఖాహారం తినడం, మద్యపానం తీసుకోరు.” అని రాసుకొచ్చింది.

READ MORE: Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..

“ప్రధానమంత్రి స్వయంగా నిర్వహించే దీపావళి పార్టీలో మెనూ ఎంపిక దీపావళి పండుగకు సంబంధించిన మతపరమైన సంప్రదాయాలపై అవగాహన లేకపోవడాన్ని తెలియజేస్తోంది. సాంస్కృతిక సున్నితత్వం, చేరిక కోసం హిందూ కమ్యూనిటీ సంస్థలు, మత పెద్దలను సంప్రదించారా?” అని ఇన్‌సైట్ యూకే లేవనెత్తింది.

READ MORE:Vikrant Massey: దేశంలో ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదు..కానీ.. ప్రముఖ హీరో కీలక కామెంట్స్

డౌనింగ్ స్ట్రీట్ సమాధానం..
ఈవెంట్‌లో అందించిన వాటిపై డౌనింగ్ స్ట్రీట్ వ్యాఖ్యానించలేదు. అయితే.. ఇది బహుళసాంస్కృతిక కార్యక్రమం అని, ఇది సిక్కు కమ్యూనిటీకి చెందిన బండి చోర్ దివాస్‌ను కూడా జరుపుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో బ్రిటీష్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన నాయకులు, నిపుణులు, పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, స్టార్మర్ 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల దీపాలను వెలిగించారు. గత ప్రధాని రిషి సునాక్ కూడా అదే చేశాడని తెలిపింది. పీఎం స్టార్మర్ తన ప్రసంగంలో.. “మేము మీ వారసత్వం, సంప్రదాయాలను గౌరవిస్తాం. దీపావళి సమయం ఐక్యత, శ్రేయస్సు, స్వాగతానికి ప్రతీక. చీకటిపై వెలుగు సాధించిన విజయంగా దీన్ని చూడండి.” అని తెలిపారు.