Leading News Portal in Telugu

demand for abortion pills skyrockets in us as women stockpile after donald trumps election


  • అబార్షన్ మందులకు అమెరికాలో భారీ గిరాకీ

  • గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారంటూ వదంతులు

  • 24 గంటల్లోనే అబార్షన్‌ మాత్రల కోసం 10 వేలకు పైగా ఆర్డర్లు
Abortion pills: అబార్షన్ మందులకు అమెరికాలో భారీ గిరాకీ.. కారణమిదే!

అమెరికాలో అబార్షన్ మందులకు భారీగా డిమాండ్ పెరిగింది. చాలామంది గర్భనిరోధకాలు, అబార్షన్ మాత్రలను ఆర్డర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా ఇంతగా డిమాండ్ ఎందుకు పెరిగింది. ఆ మందులనే ఎందుకు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: China: చైనాలో అమానుష ఘటన.. కార్‌ ఢీకొట్టి 35 మంది మృతి..

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా మందులు కొనుగోళ్లు చేస్తున్నట్లు సంబంధిత వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 24 గంటల్లోనే అబార్షన్‌ మాత్రల కోసం 10 వేలకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కానివారేనని తెలిపింది. ఎన్నికలకు ముందు గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4000 నుంచి 4,500 వరకు తమ వెబ్‌సైట్‌ చూసేవారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక అలా చూసేవారి సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఒక్క రోజులోనే 82 వేల మందికి పైగా వెబ్‌సైట్‌ను చూస్తున్నారని తెలుస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్‌ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలామంది మాత్రలు నిల్వ చేసుకున్నట్లు నేషనల్‌ అబార్షన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటెనో అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి: Megastar : జపాన్ కు మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే..?