Leading News Portal in Telugu

PM Modi Congratulates Naveen Ramgoolam On His Election Win In Mauritius


  • మారిషస్ కొత్త ప్రధానిగా నవీన్ రామ్‌గూలం..

  • శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ..
Naveen Ramgoolam: మారిషన్ ప్రధానిగా నవీన్ రామ్‌గూలం విజయం.. మోడీ అభినందన..

Naveen Ramgoolam: మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్‌గూలం విజయం సాధించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అభినందించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన విశిష్టమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అతనితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం నాటి పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ప్రస్తుతం ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ తన ఓటమిని అంగీకరించారు. ఎల్ అలియన్స్ లెపెప్ భారీ ఓటమిని చవిచూసిందని ఆయన చెప్పారు. మీడియా నివేదికల ప్రకారం, అలయన్స్ ఆఫ్ చేంజ్ కూటమి నాయకుడు నవీన్ రామ్‌గూలం(77) హిందూ మహాసముద్ర ద్వీప సమూహానికి తదుపరి ప్రధాని కాబోతున్నారు. కొత్త ప్రధానికి మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ.. భారతదేశాన్ని పర్యటించాలని కోరినట్లు ఎక్స్‌లో వెల్లడించారు.