Leading News Portal in Telugu

Alexei Zimin, A UK-Based Russian Chef Who Criticised Vladimir Putin, Found Dead In Serbia Hotel


  • పుతిన్ విమర్శకుడు.. సెలిబ్రిటీ చెఫ్ జిమిన్ అనుమానాస్పద మృతి..,
    సెర్బియా హోటల్ గదిలో శవంగా కనిపించిన జిమిన్..,
Alexei Zimin: రష్యా సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ విమర్శకుడు అనుమానాస్పద మృతి..

Alexei Zimin: రష్యన్ సెలిబ్రిటీ చెఫ్, పుతిన్‌ని విమర్శించే 52 ఏళ్ల అలెక్సీ జిమిన్ అనుమానాస్పద రీతిలో మరణించారు. సెర్బియాలో ఓ హోటల్ గదిలో శవంగా కనిపించాడు. 2014లో రష్యా ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను స్వాధీనం చేసుకోవడంపై జిమిన్ పుతిన్‌ని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఆ తర్వాత రష్యా విడిచి యూరప్ పారిపోయి వచ్చారు. జిమిన్ లండన్‌లో తన వ్యాపారాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పుతిన్‌ని విమర్శించకముందు రష్యన్ ఎన్‌టీవీలో ప్రసిద్ధమైన వంటల ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరించారు. పుతిన్‌పై విమర్శలు చేసిన తర్వాత ఈ షో నిలిచిపోయింది.

జిమిన్ బెల్‌గ్రేడ్‌లోని ఒక హోటల్ గదిలో చనిపోయినట్లు రష్యన్ మీడియాను ఉటంకిస్తూ.. బీబీసీ నివేదించింది. అతను బ్రిటన్ ఆంగ్లోమేనియా గురించి తన కొత్త పుస్తకాన్ని ప్రచారం చేయడానికి సెర్బియా రాజధానికి వెళ్లారు. మిస్టర్ జిమిన్ మరణానికి సంబంధించి ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని, శవపరీక్ష, టాక్సికాలజీ నివేదిక కొనసాగుతోందని సెర్బియా అధికారులు తెలిపారు. జిమిన్ మరణాన్ని అతడి రెస్టారెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధ్రువీకరించింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడ ఆయన పుతిన్‌కి వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. యూకేకి వెళ్లిన తర్వాత జిమిన్ ఇప్పటి వరకు రష్యాకు తిరిగి రాలేదు.