Leading News Portal in Telugu

Who Is Tulsi Gabbard, US Intelligence Chief Who Will Oversee 18 Spy Agencies


  • యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్..,
    భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి హిందూగా గుర్తింపు..,
    ట్రంప్ గట్టి మద్దతుదారుల్లో తులసీ ఒకరు..
Tulsi Gabbard: ఎవరు ఈ తులసీ గబ్బార్డ్..? యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియామకం..

Tulsi Gabbard: అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ముందే తన టీమ్‌ని ఖరారు చేసుకుంటున్నాడు. తాజాగా మాజీ డెమొక్రాటిక్ ప్రతినిధి నుంచి ట్రంప్ మద్దతుదారుగా మారిన తులసీ గబ్బార్డ్‌ని తన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె కింద మొత్తం అమెరికాలోని 18 గూఢచార ఏజెన్సీలు పనిచేస్తాయి.

2022లో డెమొక్రాటిక్ పార్టీని వీడిన తర్వాత గబ్బార్డ్ ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్‌కి ఆమోదం తెలిపారు. ట్రంప్‌కి ఎన్నికల్లో గట్టి మద్దతుదారుగా మారారు. ‘‘తులసీ గబ్బార్డ్ తమ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకి అద్భుతమైన స్పూర్తిని తీసుకువస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. గతంలో ఈమె ఉక్రెయిన్‌కి అమెరికా మద్దతుని వ్యతిరేకించారు.

తులసీ ప్రారంభ జీవితం:

తులసీ గబ్బార్డ్ ఏప్రిల్ 12, 1981న అమెరికన్ సమోవాలోని లెలోలోవాలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసున్న సమయంలో ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది. ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి మైక్ గబ్బార్డ్ రిపబ్లికన్ పార్టీ నుంచి డెమొక్రాట్స్‌కి మారాడు. హవాయి స్టేట్ సెనెటర్‌గా పనిచేశాడు. ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్‌ని వివాహం చేసుకుంది. గబ్బార్డ్ ఆర్మీ నేషనల్ గార్డ్,2లో రెండు దశాబ్ధాలుగా పనిచేశారు. ఆమె ఇరాక్, కువైట్ లో పనిచేశారు.

కాంగ్రెస్‌కి ఎన్నికైన మొదటి హిందువు:

గబ్బార్డ్ హవాయి ప్రతినిధుల సభకు 21 ఏళ్లలో ఎన్నికయ్యారు. ఆమె సభలో మొదటి హిందూ సభ్యురాలిగా అవతరించింది. భగవద్గీతపై ప్రమాణస్వీకారం చేశారు.

అధ్యక్ష పదవి కోసం:

2020లో అధ్యక్ష పదవి కోసం డెమొక్రాటిక్ అభ్యర్థిత్వాన్ని కోరడంతో తులసీ పేరు ఒక్కసారిగా మారుమోగింది. విదేశీ సైనిక సంఘర్షణల్లో అమెరికా ప్రమేయాన్ని ఆమె వ్యతిరేకించింది. ఆమె ఆ తర్వాత రేసు నుంచి వైదొలిగింది. చివరి ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ని రూపొందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత డెమెక్రటిక్ పార్టీని వీడారు.

ట్రంప్ కోసం ప్రచారం:

ఈ ఏడాది ప్రారంభంలో గబ్బార్డ్ డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ఇచ్చారు. అక్టోబర్‌లో నార్త్ కరోలినాలో జరిగిన ర్యాలీలో ఆమె అధికారికంగా రిపబ్లిక్‌గా మారుతున్నట్లు ప్రకటించింది.