Leading News Portal in Telugu

PM Narendra Modi meets Giorgia Meloni during G20 Summit


  • బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో కొనసాగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు..
  • మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చిన మెలోడి మూమెంట్..
  • నెట్టింట ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని మోడీ ఫోటోలు వైరల్
Meloni-Modi: మరోసారి ట్రెండింగ్లోకి మెలోడీ మూమెంట్..

Meloni-Modi: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పలు దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక అంశాల్లో సహకారం గురించి చర్చించామని భారత ప్రధాని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టును పెట్టారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగైన ప్రపంచానికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. భారత్‌, ఇటలీ ప్రధానులు మోడీ, జార్జియా మెలోనీ మధ్య స్నేహం కూడా కొనసాగుతుంది. అది వారు దిగే ఫోటోల్లో కనపడుతుంది. ఇక, మెలోడీ (మెలోనీ+మోడీ) పేరిట ఆ పిక్చర్స్ పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. తాజాగా జీ20 వేదికగా ఈ మెలోడీ మూమెంట్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అయితే, జీ20 సదస్సులో పాల్గొన్న పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆయన్ను హస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పరాగ్వే ప్రథమ మహిళ లెటీసియా ఒకాంపోస్‌ వెల్లడించారు. వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు.