Leading News Portal in Telugu

india china direct flights soon jaishankar meets chinese foreign minister


  • జీ 20 సదస్సులో గుడ్‌న్యూస్
  • త్వరలో భారత్.. చైనా విమాన సర్వీసులు ప్రారంభం!
India-China: గుడ్‌న్యూస్.. త్వరలో భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం!

భారత్-చైనా మధ్య మెల్లమెల్లగా సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయి. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి భారత్-చైనా బోర్డర్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. దీన్ని పురస్కరించుకుని దీపావళి రోజున స్వీట్లు పంచుకున్నారు. తాజాగా బ్రెజిల్‌లో జరుగుతున్న జీ 20 సదస్సు కారణంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించబడే దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చైనా ఉత్పత్తులు మళ్లీ భారత్‌లోకి ప్రవేశించే పరిస్థితులు మొదలవుతున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభించే అంశంపై రెండు దేశాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కైలాస మానసరోవరం యాత్ర పునఃప్రారంభం అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. బ్రెజిల్‌లో జరుగుతోన్న జీ20 సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, చైనా మంత్రి వాంగ్‌ యీ ఈ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కరోనా మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఇటీవల లద్దాఖ్‌ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా విమాన సర్వీసుల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైతే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి.