- ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేశాం
- ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని నెతన్యాహు ప్రకటన
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది. ఈ పరిణామంతో భారీగానే ఇరాన్ నష్టపోయినట్లు తెలుస్తోంది. తిరిగి కోలుకునేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అక్టోబర్‌లో ఇరాన్‌పై దాడి చేసిన విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో నెతన్యాహు వెల్లడించారు. ఏప్రిల్‌లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మూడు బ్యాటరీలు మిగిలి ఉండగా.. అక్టోబర్‌లో చేసిన దాడిలో వాటిని కూడా ధ్వంసం చేసినట్లు చెప్పుకొచ్చారు. క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేసినట్లు నెతన్యాహు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP Legislative Council: ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజును తిరిగి గుర్తించిన ఏపీ శాసనమండలి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇరాన్ అణుస్థావరాలు, ఇతర ముప్పులపై దాడి చేసే సామర్థ్యాలను పరీక్షిస్తామని నెతన్యాహు వెల్లడించారు. ఏ రకంగా దాడులు చేస్తాం.. మా పాలసీ ఏంటి? అనేది ఇప్పుడే బహిర్గతం చేయమన్నారు. కొత్త అధ్యక్షుడు ఆఫీస్‌లోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందన్నారు. బైడెన్ నుంచి వచ్చే సూచనలన్నీ పాటిస్తామని కచ్చితంగా చెప్పలేమని వెల్లడించారు. బైడెన్ కార్యవర్గం అనేక సార్లు షరతులు విధించిందని గుర్తుచేశారు. గాజాలోకి వెళ్లొద్దని.. ఖాన్ యూనిస్‌పై అడుగుపెట్టొద్దని షరతులు విధించినట్లు తెలిపారు. ఒకవేళ వెళ్తే ఆయుధ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించినట్లుగా గుర్తుచేశారు. చివరికి అన్నంత పని కూడా చేశారని నెతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Cyber Fraud Arrest: 100 కోట్లకు పైగా సైబర్ మోసానికి పాల్పడిన చైనా వ్యక్తి అరెస్ట్
అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 180 క్షిపణులను ఒక్కసారిగా ప్రయోగించింది. గగనతలంలోనే క్షిపణులను ఐడీఎఫ్ దళాలు పేల్చేశాయి. అయితే కొన్ని మాత్రం టెల్ అవీవ్ ప్రాంతంలో పడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొంత ఆస్తులు ధ్వంసం అయినట్లుగా సమాచారం. అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఇక హమాస్‌కు మద్దతు పలికిన హిజ్బుల్లాను కూడా మట్టుబెట్టింది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతం చేసింది.
ఇది కూడా చదవండి: Medak Incident: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్