- ఉక్రెయిన్‌లో ఎంబసీల మూసివేతకు పలు దేశాలు పిలుపు
- అమెరికా బాటలో ఇటలీ.. గ్రీస్.. స్పెయిన్
ఉక్రెయిన్-రష్యా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఇరు దేశాల మధ్య మళ్లీ భీకరమైన యుద్ధం సాగేలా సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్.. రష్యాపై ప్రయోగించింది. దీంతో ప్రతీకార దాడులకు రష్యా సిద్ధపడుతోంది. ఈ మేరకు అమెరికా అలర్ట్ చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో దాడులు జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అగ్ర రాజ్యాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అదే బాటలో పలు దేశాలు చేరాయి. ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌లు సైతం తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Bitcoin Scam: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. “బిట్‌కాయిన్ స్కాం”పై సీబీఐ విచారణ
అణ్వాయుధాల వినియోగించే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికాతో పాటు ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌లు కీవ్‌లోని ఎంబసీలను తాత్కాలికంగా మూసి వేశాయి.
ఇది కూడా చదవండి: Assembly Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!
ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. రష్యాపై ప్రయోగించింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Bribe: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ కమిషనర్..