- ఉక్రెయిన్‌లో టెన్షన్ వాతావరణం
- యూఎస్ ఎంబసీ మూసివేత
- పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాపై అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యాకి ఉత్తర కొరియా సైన్యం కలిసింది. మరోవైపు అణు దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఇంకోవైపు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ నిపుణులు భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..
ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. రష్యాపై ప్రయోగించింది. తాజాగా ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: Exit Polls: ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు.. గెలుపు ఎవరిదంటే..?