- పదేళ్ల హిందూ బాలిక కిడ్నాప్
- ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసిన ఉదంతం
- పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘటన
- బాలికను కాపాడిన అధికారులు
పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసిన ఉదంతం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. అయితే అధికారులు ఆమెను కాపాడారు. గత వారం మిర్‌పూర్ ఖాస్‌లోని కోట్ గులామ్ ముహమ్మద్ గ్రామంలోని ఇంటి బయటికి వెళ్లిన 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. సిర్‌హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారు. బాలికను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారు. అనంతరం షాహిద్ తల్పూర్‌తో వివాహం జరిపించారు. అయితే.. హిందూ మైనారిటీలో అధికారులతో సమస్యను విన్నవించడంతో ఎస్‌ఎస్పీ పోలీసు అన్వర్ అలీ తల్పూర్ జోక్యం చేసుకుని బాలికను తిరిగి తన ఇంటికి పంపించారు.
READ MORE: Pushpa 2 : ‘పుష్ప-2’లోని ‘కిసిక్’ సాంగ్‌పై లేటెస్ట్ అప్ డేట్.. ఎప్పుడు రిలీజ్ అంటే ?
కాగా.. సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని హిందూ సమాజానికి మైనర్, యుక్తవయసులో ఉన్న హిందూ బాలికలను కిడ్నాప్ చేయడం, బలవంతంగా మతమార్పిడి చేయడం, వివాహం చేసుకోవడం ప్రధాన సమస్యగా మారింది. పాకిస్థాన్ దారావర్ ఇత్తెహాద్ (మైనారిటీల హక్కుల కోసం ఏర్పాటైన ఎన్‌జీవో) అధ్యక్షుడు శివ కట్చి ప్రకారం.. సంఘర్‌లోని మరో ఘటన వెలుగు చూసింది. ఇక్కడ15 ఏళ్ల హిందూ బాలికను 50 ఏళ్ల ముస్లిం వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. ఇది మరవక ముందే తాజాగా ఈ ఘటన జరిగింది. కొందరు అవినీతిపరులైన పోలీసుల అండతో నకిలీ పత్రాలు తయారుచేశారని, బాధితురాలి తల్లిదండ్రులు/న్యాయవాది కోర్టులో కేసు వేసినప్పుడు వాటిని కోర్టులో హాజరుపరుస్తారని శివ బుధవారం చెప్పారు.
READ MORE:Fake Ration Cards: 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల గుర్తింపు