Leading News Portal in Telugu

berlin tear gas attack 22 children hospitalized elementary school


  • జర్మనీ రాజధాని బెర్లిన్ లో దారుణం
  • పాఠశాలలో టియర్ గ్యాస్ ప్రయోగం
  • అస్వస్తతకు గురైన 43మంది విద్యార్థులు
Berlin : పాఠశాలలో టియర్ గ్యాస్ దాడి.. ఆస్పత్రిలో చేరిన 22 మంది పిల్లలు

Berlin : జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని దాడి చేసిన వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. స్థానిక మీడియా ప్రకారం.. ఈ దాడిలో ఒక పిల్లవాడి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 43 మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వీబెన్సీ స్కూల్ ప్రాంతంలో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం పాఠశాలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషవాయువును పిచికారీ చేశారని పోలీసులను ఉటంకిస్తూ మీడియా కథనాలు చెబుతున్నాయి. దాడి చేసిన వ్యక్తి యువకుడా లేక చిన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. క్లాస్ రూమ్ డోర్ నుంచి టియర్ గ్యాస్ స్ప్రే చేసినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ బృందం వెంటనే పాఠశాల మొత్తాన్ని పరిశీలించి గాలిలో ఉన్న టియర్‌గ్యాస్‌ను తొలగించి తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు నవంబర్ నెలలో చైనాలోని ఓ పాఠశాలలో కత్తితో దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది. ఘటనా స్థలంలోనే దాడి చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్ పర్యటనకు వచ్చారు. రెండున్నర సంవత్సరాల తర్వాత అతను ఉక్రెయిన్ చేరుకున్నాడు. కొద్ది వారాల క్రితమే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స్కోల్జ్ ఫోన్‌లో మాట్లాడినందుకు ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విమర్శించారు. అమెరికాలో అధికార మార్పిడి జరిగి జనవరిలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఆయన ఈ చర్య తీసుకున్నారు.