Leading News Portal in Telugu

PM Modi to visit Kuwait from Today, first by Indian PM in 43 years


  • నేటి నుంచి కువైట్‌లో రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటన..
  • భారత్- కువైట్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ..
  • కువైట్‌లోని భారతీయ సంతతి వ్యక్తులతో ప్రధాని మోడీ సమావేశం..
PM Modi to Visit Kuwait: నేడు కువైట్కు ప్రధాని మోడీ.. 43 ఏళ్ల తర్వాత గల్ఫ్‌ దేశంలో పర్యటన!

PM Modi to Visit Kuwait: నేటి నుంచి ప్రధాని మోడీ కువైట్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్‌ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే మొదటి సారి కావడం విశేషం. కువైట్‌ అమీర్‌ షేక్‌ మెషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జబీర్‌ అల్‌ సబాహ్‌ ఆహ్వానం మేరకు ఇండియా, కువైట్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, ఈ పర్యటనలో భాగంగా మోడీ కువైట్‌ పాలకులతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. అక్కడ భారతీయ సంతతి వ్యక్తులతో సమావేశం కానున్నారు.

అయితే, చివరిసారిగా 1981లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. అలాగే, కువైట్- భారత్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక, ఈ నెల 22 (ఆదివారం)న కువైట్ ఉన్నత అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా చర్చలు జరపనున్నారు. కువైట్‌లో దాదాపు పది లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ పర్యటించని ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్.