Leading News Portal in Telugu

Former Pakistani Prime Minister Imran Khan sentenced to 14 years


  • అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు జైలు శిక్ష
  • తనతో పాటు భార్యకు కూడా శిక్ష అమలు
  • జైలు శిక్షతో పాటు కొన్నిలక్షల జరిమానా కూడా
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష

Imran Khan : 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించబడింది. కోర్టు తన నిర్ణయంతో పాటు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని కూడా అరెస్టు చేయాలని ఆదేశించింది. తీర్పు వినడానికి ఆమె అడియాలా జైలుకు హాజరయ్యారు. అక్కడ పోలీసులు ఆమెను అధికారిక అరెస్టు కోసం చుట్టుముట్టారు.

అడియాలా జైలులోని తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ఈరోజు కీలకమైన తీర్పును వెలువరించారు. అయితే దీనికి ముందు శిక్షపై నిర్ణయం మూడుసార్లు వాయిదా పడింది. ఇమ్రాన్ కు రూ.10 లక్షలు, బుష్రాకు రూ.5 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారికి 6 నెలల జైలు శిక్ష విధించబడుతుంది. అడియాలా జైలు వెలుపల గట్టి భద్రత మధ్య తీర్పు వెలువడింది. ఆ తర్వాత బుష్రాను కోర్టు గది నుండే అరెస్టు చేశారు.