Leading News Portal in Telugu

Indian community members congratulate Donald Trump


  • నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..
  • ట్రంప్‌కు అభినందనలు తెలిపిన భారతీయ సంఘం సభ్యులు..
  • అమెరికా- భారత్ సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి..
Indian Community: డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపిన భారత కమ్యూనిటీ

Indian Community: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈరోజు (జనవరి 20) ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారతీయ సంఘం సభ్యులు అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త పరిపాలనలో అమెరికా- భారత్ సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, మంగళవారం నాడు వైట్ హౌస్‌లోకి నూతన అధ్యక్షుడి హోదాలో వెళ్లనున్న ట్రంప్ కు భారత్ ఎలప్పుడు స్నేహపూర్వకంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఈరోజు జరిగే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఆయనతో పాటు ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ కూడా పాల్గొనబోతున్నారు.

అయితే, ఈరోజు వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి మధ్యాహ్నం ( భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలు ) పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అయితే, అధ్యక్ష పదవీ చేపట్టిన తర్వాత ట్రంప్.. చైనాతో పాటు భారత్‌లో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.