Leading News Portal in Telugu

Vivek Ramaswamy quits DOGE hours after Donald Trump takes office


  • అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం వేళా కీలక పరిణామం..
  • డోజ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భారత అమెరికన్‌ వ్యాపారవేత్త..
  • ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకే వివేక్ రామస్వామి ఈ నిర్ణయం..
Vivek Ramaswamy: ట్రంప్‌ కార్యవర్గం నుంచి తప్పుకున్న వివేక్‌ రామస్వామి.. ఎందుకో తెలుసా..?

Vivek Ramaswamy: అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక పరిణామం జరిగింది. భారత అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్‌ కార్యవర్గంలో కీలకమైన డోజ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే, ట్రంప్‌ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎలాన్‌ మస్క్‌తో పాటు వివేక్‌ రామస్వామికి ఈ బాధ్యతలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే, ఈ సందర్బంగా వివేక్‌ రామస్వామి ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. డోజ్‌ ఏర్పాటుకు సపోర్టు ఇవ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్‌ మస్క్‌ టీమ్ విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను.. ఒహియోలో నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో నేను మరిన్ని విషయాలు చెబుతాను.. ముఖ్యంగా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి తన వంతు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ పేర్కొన్నాడు. దీంతో, వివేక్ రామస్వామి నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.