Leading News Portal in Telugu

pakistan lahore man injured in lion attack while filming tiktok


  • సింహంతో టిక్‌టాక్
  • తుంటరి యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం
  • పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఘటన
Pakistan: సింహంతో టిక్‌టాక్.. తుంటరి యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. వీడియోలు పోస్టు చేసేందుకు యువత అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే లైక్‌లు కోసమో తెలియదు గానీ.. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోయాయి. అయినా కూడా చాలా మందికి బుద్ధి రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సహజంగా సింహాన్ని చూస్తేనే.. వణుకుపుడుతుంది. అలాంటిది దాని దగ్గరకు వెళ్లి టిక్‌టాక్ చేసేందుకు ప్రయత్నించి దాని నోటికి చిక్కాడు. అంతే సింహం దాడిలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరాడు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: రంగం ఏదైనా భారతీయులదే విజయం.. దావోస్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పంజాబ్‌ ప్రావిన్సుకు చెందిన ముహమ్మద్‌ అజీమ్‌ అనే యువకుడు.. లాహోర్‌ సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాడు. బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్‌ చేసేందుకు లోపలికి వెళ్లాడు. అంతే వెంటనే సింహం దాడికి దిగింది. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి అతడిని రక్షించారు. తీవ్రగాయాలు కావడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధింత యాజమాన్యంపై మండిపడ్డారు. అంతేకాకుండా ఫామ్‌ యజమాని బ్రీడింగ్‌ లైసెన్సును రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Venu Swami: నాగచైతన్య, శోభితల జోస్యం.. వేణు స్వామి బహిరంగ క్షమాపణలు