Leading News Portal in Telugu

Iran: Women Banned from Cycling and Dancing, Face Harsh Punishments for Defying Morality Laws


Iran : ఈ దేశంలో మహిళలకు సైకిల్ తొక్కే స్వేచ్ఛ కూడా లేదు

Iran : ఇరాన్ తన మహిళా వ్యతిరేక విధానాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైంది. అది మహిళలపై బలవంతంగా హిజాబ్ విధించడం కావచ్చు లేదా చిన్న వయసులోనే బాలికల వివాహం కోసం ఆదేశాలు జారీ చేయడం కావచ్చు. ఇరాన్‌లో చాలా కాలంగా మహిళల హక్కుల గొంతు వినిపిస్తోంది. కానీ ఆ గొంతు వినడానికి బదులుగా అక్కడి ప్రభుత్వం తన చెవులు, కళ్ళు మూసుకుంది. ఈసారి ఇరాన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసేసరికి, ఇద్దరు అమ్మాయిలు తమ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఒక్క డ్యాన్స్ వీడియో ఆధారంగా పోలీసులు ఎవరూ ఊహించని ఒక అడుగు వేశారు.

డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ఇద్దరు బాలికలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ఇచ్చిన కారణం వస్త్రధారణ. ఇరాన్ నైతిక పోలీసులు ఈ అమ్మాయిల దుస్తులను అసభ్యకరంగా ప్రకటించారు. అరెస్టు తర్వాత ఈ ఇద్దరు బాలికల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు కూడా క్లోజ్ అయ్యాయి. ఇద్దరు అమ్మాయిలలో ఒకరు జీన్స్, పుల్ ఓవర్ వేసుకుని ఉండగా, మరొక అమ్మాయి జీన్స్, టాప్, దానిపై హూడీ వేసుకుని ఉంది.

ఇంకో విషయం ఈ అమ్మాయిలు నృత్యం చేస్తున్న ప్రదేశం ఇరాన్ యుద్ధ స్మారక చిహ్నం. అందువల్ల, వారు అమరవీరులను అవమానించారని కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం, ఈ ఇద్దరు బాలికలు ఇరాన్‌లోని ఏదో ఒక జైలులో ఉన్నారు. వారు నృత్యం చేసిన నేరానికి శిక్షార్హులు అయ్యారు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అక్కడ ఇలా డ్యాన్సులు చేయడం పూర్తిగా నిషేధించారు. ఇరాన్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 637 ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో నృత్యం చేయడం నేరం. అటువంటి నేరానికి పాల్పడినట్లు రుజువైతే శిక్ష 99 కొరడా దెబ్బలు.

ఈ అమ్మాయిలకు కూడా 99 కొరడా దెబ్బల శిక్ష పడే అవకాశం ఉంది. ఇరాన్ నృత్యం చేసే అమ్మాయిలపై ఇంత నైతిక అణచివేతకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. 2023 సంవత్సరంలో, ఐదుగురు అమ్మాయిలు పాప్ స్టార్ సెలీనా గోమెజ్ పాటకు బహిరంగంగా నృత్యం చేశారు. ఈ అమ్మాయిల నృత్య వీడియో చాలా వైరల్ అయింది. కానీ ఈ ఐదుగురి గతి ఇరాన్‌లో స్వేచ్ఛ కోరుతున్న ప్రతి అమ్మాయి గతి లాంటిదే. బహిరంగ ప్రదేశంలో నృత్యం చేశారనే ఆరోపణలపై ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. డ్యాన్స్ చేయడమే కాదు తాజాగా మహిళలు బహిరంగంగా సైకిల్ తొక్కడాన్ని కూడా నిషేధించారు.