Leading News Portal in Telugu

Indian-origin Canadian PM candidate Ruby Dhalla says she will deport illegal immigrants


  • ట్రంప్ దారిలోనే కెనడా..
  • అక్రమ వలసల్ని బహిష్కరిస్తామన్న కెనడా పీఎం అభ్యర్థి..
  • కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ రూబీ ధల్లా..
Canada: ట్రంప్ దారిలోనే కెనడా.. అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తానన్న పీఎం అభ్యర్థి..

Canada: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమెరికాలో అక్రమంగా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వారిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బహిష్కరిస్తోంది. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కెనడా లిబరల్ పార్టీ తరుపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న భారత సంతతికి చెందిన రూబీ ధల్లా కూడా, తాను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసదారుల్ని కెనడా నుంచి బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ధల్లా 004 నుండి 2011 వరకు బ్రాంప్టన్-స్ప్రింగ్‌డేల్ నుండి ఎంపీగా ఉన్నారు. అక్టోబర్ 2025 కెనడా ఎన్నికల్లో గెలిస్తే జస్టిన్ ట్రూడో స్థానంలో ధల్లా లిబరల్ పార్టీ నాయకురాలిగా, కెనడా ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా పోటీలో దిగారు.

ధల్లా తన ఎక్స్ పోస్ట్‌లో.. ‘‘ప్రధాని మంత్రిగా తాను అక్రమ వలసదారులను బహిష్కరిస్తాను. మానవ అక్రమ రవాణాదారులనున అణిచివేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా’’ అని రాశారు. లిబరల్ పార్టీ నాయకురాలిగా, కెనడా తదుపరి ప్రధానిగా మొదటిసారిగా నల్లజాతి మహిలను ఎన్నుకోవడం ద్వారా చర్రిత్ర సృష్టించే అంచులో ఉన్నామని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. ధల్లా, మాజీ బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ కార్నీ, మాజీ ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం విపక్ష పియరీ పొలివేరే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కెనడా ఎన్నికల పోల్స్‌లో ముందంజలో ఉంది. మరోవైపు లిబరల్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాని జస్టిన్ ట్రూడో విధానాలపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రధాని అభ్యర్థి పోటీలో ఉన్న ధల్లా విన్నిపెగ్‌లో పంజాబ్ నుంచి వలస వచ్చిన కుటుంబంలో పుట్టారు. లిబరల్ పార్టీ నాయకత్వ రేసులో గెలుపొందిన వారు కెనడా ప్రధాని అభ్యర్థి బరిలో ఉంటారు.