Leading News Portal in Telugu

“They Tried To Kill Putin”: Tucker Carlson Blames Joe Biden’s Administration


  • పుతిన్‌ని చంపేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యత్నం..
  • టక్కర్ కార్ల్‌సన్ సంచలన వ్యాఖ్యలు..
Tucker Carlson: జో బైడెన్ పాలనలో పుతిన్‌ని చంపాలని ప్రయత్నించారు..

Tucker Carlson: ఫాక్స్ న్యూస్‌కి చెందిన మాజీ ఉద్యోగి టక్కర్ కార్ల్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోబైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని చంపడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే, టక్కర్ తన వాదనల్ని నిరూపించేలా ఎలాంటి ఆధారాల గురించి చెప్పలేదు. ‘‘ది టక్కర్ కార్ల్‌సన్ షో’’ తాజా ఎపిసోడ్‌లో కార్ల్‌సన్, అమెరికన్ రైటర్ అండ్ జర్నలిస్ట్ మాట్ తైబ్బితో సంభాషించారు.

అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ నిజమైన యుద్ధం కోసం చాలా కష్టపడ్డారని, పుతిన్‌ని చంపడానికి యత్నించారని, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పుతిన్‌ని చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఒకవేళ పుతిన్ హత్యకు గురైతే, రష్యాని ఎవరు స్వాధీనం చేసుకునేవారు..? సంక్లిష్టమైన దేశంలో అణ్వాయుధ సామాగ్రికి ఏం జరుగేది..? అంటూ కార్ల్‌సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పందించలేదు. కానీ క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. పుతిన్ భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బైడెన్ పాలనలో పుతిన్‌ని చంపడానికి ప్రణాళిక చేశారనే కార్ల్‌సన్ వ్యాఖ్యలపై ప్రముఖ రష్యన్ యుద్ధ విశ్లేషకుడు సెర్గీ మార్డాన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని తెలిపారు. బైడెన్ బలహీనమైన అధ్యక్షుడిగా వర్ణించిన ఆయన, ఆయన పాలనలో ఇది జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్లింకెన్ మొండివాడని అతడు ఉక్రెయిన్‌నే కాకుండా సొంత అమెరికన్లను కూడా యుద్ధంలోకి దించేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్ల్‌సన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.