- త్వరలోనే ట్రంప్-ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం
- ఈనెలలో ఫ్రాన్స్, అమెరికా టూర్‌కు మోడీ
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు దేశాల దౌత్యవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: ఫడ్నవిస్ సర్కార్ సంచలన నిర్ణయం.. ‘మరాఠీ’ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. తొలి విడత పాలనలో ట్రంప్.. భారత్ పర్యటనలకు వచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అంతేకాకుండా ట్రంప్-భారత్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మోడీ భేటీపై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: Atul Subhash case: ‘‘మగాళ్లు బలవుతున్నారు’’.. పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ..