Leading News Portal in Telugu

Alaska missing plane incident turned tragic


  • అలస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం
  • విమానం మిస్సింగ్ ఘటన విషాదాంతం
  • విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు
Alaska plane crash: అమెరికాలో కూలిన విమానం.. 10 మంది మృతి

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఫ్లైజ్ జర్నీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అలస్కాలో మూడు రోజుల క్రితం ఓ విమానం మిస్సైన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కాసేపటికే అదృష్యమైపోయింది. యునలక్లీట్ నుంచి అలస్కా మీదుగా నోమ్ వెళ్తున్న ఫ్లైట్ రాడార్ల నుంచి మిస్సైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అలస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది.

విమానం మిస్సింగ్ ఘటన విషాదాంతంగా మారింది. 10 మంది ప్రయాణికులతో అదృష్యమైన విమానం కూలిపోయింది. సముద్రంలో భారీ మంచు పలకంపై విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. విమానంలో ప్రయాణించిన వారంతా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.