Leading News Portal in Telugu

Ready To Send Our Troops To Ukraine If Needed: UK PM Keir Starmer


  • రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతుగా నిలిచిన బ్రిటన్..
  • ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపడానికి తాను సిద్ధంగా ఉన్నా: కీర్ స్టార్మర్
  • త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అవుతా: యూకే ప్రధాని స్టార్మర్
UK PM Keir Starmer: అవసరమైతే మా సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నాం..

UK PM Keir Starmer: రష్యాపై యుద్ధంలో కీవ్‌కు మద్దతు ఇవ్వడంలో యూకే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు భద్రతా పరంగా అండా ఉండటానికి యూరప్ దేశాలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, యూరప్ దేశాల భద్రతను నిర్ధారించడానికి అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపడానికి తాను సిద్ధంగా ఉన్నానని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ విషయం నేను తేలికగా చెప్పడం లేదు.. ఈ నిర్ణయం వల్ల బ్రిటిష్ సైనికులు, మహిళలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని యూకే ప్రధాని అన్నారు.

ఇక, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ప్రయత్నాలపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈరోజు (ఫిబ్రవరి 17) పారిస్‌లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో తాను పాల్గొంటానని యూకే ప్రధాని స్టార్మర్ ధృవీకరించారు. రాబోయే రోజుల్లో తాను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తానన్నారు. యూరప్- అమెరికా కలిసి పని చేయడంలో బ్రిటన్ “ప్రత్యేకమైన పాత్ర” వహిస్తుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతికి అమెరికా భద్రతా హామీ చాలా అవసరం, ఎందుకంటే యూఎస్ మాత్రమే పుతిన్‌ను మళ్లీ దాడి చేయకుండా నిరోధించగలదు అని స్టార్మర్ పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి మూడు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొనే అవకాశం ఉంది.