
Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన రిహార్సల్స్ వాటికన్‌లో జరుగుతున్నాయి. క్రైస్తవ మతంలో పోప్‌కు అత్యున్నత స్థానం ఇచ్చారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిలకు అధిపతిగా కొనసాగుతున్నారు. పోప్ అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో ఓ సారి తెలుసుకుందాం.
ఈసారి బతికే ఆశ లేదు
88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతని పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు. కానీ ఈసారి పోప్ బతికే అవకాశం లేదని సమాచారం. ఇటీవల పోప్ తన సన్నిహితులతో కూడా ఈసారి తాను బ్రతకలేనేమోనని భయపడుతున్నట్లు చెప్పాడు.
పోప్ అంత్యక్రియలు ఎలా జరుగుతాయి?
నవంబర్ 2024లో పోప్ అంత్యక్రియలను ఎలా నిర్వహించాలనే దానిపై ఒక నియమాన్ని రూపొందించారు. పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా దానిపై తుది ముద్ర వేశారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారని చెబుతున్నారు. పోప్ మరణాన్ని కామెర్లెంగో (సీనియర్ వాటికన్ అధికారి) ప్రకటిస్తారు. వాటికన్‌లో ఈ ముఖ్యమైన పదవిని ప్రస్తుతం ఐరిష్‌లో జన్మించిన కార్డినల్ కెవిన్ ఫారెల్ నిర్వహిస్తున్నారు.
గతంలో పోప్ మరణించినప్పుడు మృతదేహాన్ని చాలా కాలం పాటు బహిరంగంగా ఉంచేవారు.. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం అలా జరగదు. మరణించిన వెంటనే మృతదేహాన్ని శవపేటికలో ఉంచడం తప్పనిసరి. గతంలో మూడు శవపేటికలు ఉంచేవారు. కానీ ఇప్పుడు అది నిలిచిపోయింది. సాధారణ పౌరులు పోప్ మృతదేహాన్ని శవపేటికలో ఉంచిన తర్వాతే చూడగలరు. పోప్ మృతికి 9 రోజుల సంతాప దినాలు పాటించనున్నారు.
సాధారణంగా పోప్ మరణం తర్వాత ఆయనను సెయింట్ పీటర్స్‌లోని సమాధిలో ఖననం చేస్తారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ తన జీవితకాలంలో ఈ నియమాన్ని మార్చారు. ఇప్పుడు పోప్ అంత్యక్రియలు ఏ సమాధిలోనైనా జరగవచ్చు. పోప్ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలను రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికా సమాధిలో నిర్వహించాలని కోరుకుంటున్నారు. పోప్ కోరిక అంత్యక్రియల సమయంలో నెరవేరుతుందని చెబుతున్నారు. ఖననం చేసే సమయంలో సమాధిలో నాణేలను ఉంచుతారు. అయితే, ఇది అవసరం లేదు. ఖననం చేసే సమయంలో అతడి పదవీకాలాన్ని ప్రస్తావించే 1000 పదాల పత్రం తయారు చేయబడుతుంది. చరిత్రను కాపాడటానికి ఈ పని జరుగుతుంది.